Explore

Search

November 7, 2026 6:12 pm

బాల చిత్రకారిణి జైష్ణ అద్భుతం.. ‘కార్మిక తల్లి’ చిత్రంపై ప్రశంసలు

చంటి ఛానల్,తెలంగాణ: హైదరాబాద్ చింతల్ సెయింట్ మార్టిన్స్ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న అబ్బరాజు నాగశ్రీ రాజేశ్వరి జైష్ణ, కార్మిక దినోత్సవం సందర్భంగా గీసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక మహిళా కార్మికురాలు నెత్తిపై గడ్డిమోపుతో, బిడ్డను ఎత్తుకుని ఇంటికి వెళ్తున్న దృశ్యాన్ని ఈ చిన్నారి ఎంతో హృద్యంగా ఆవిష్కరించింది. శశాంక, గాయత్రి దంపతుల కుమార్తె అయిన జైష్ణ ప్రతిభను చూసి ఆమె తాత శేషతల్ప సాయి (మెజిస్ట్రేట్), నాయనమ్మ (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు) తో పాటు పలువురు ప్రముఖులు ఈ బాల మేధావిని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్