చంటి ఛానల్,బోధన్: పట్టణ ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఓం యోగశాల ఆధ్వర్యంలో మే 5వ తేదీ నుంచి ప్రతిరోజూ ప్రత్యేక యోగా శిక్షణ శిబిరం ప్రారంభం కానుంది. ప్రముఖ యోగా మాస్టర్, అంతర్జాతీయ పతక విజేత క్యాతమ్ గంగాధర్ ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరంలో పెద్దలకు ఉదయం 5:30 నుండి 6:30 వరకు, పిల్లలకు ఉదయం 6:30 నుండి 7:30 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. యోగా ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని, ఒత్తిడి లేని జీవనం గడపాలని ఆశించే ఆసక్తి గల వారు 9951306030 నంబర్ ను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

