చంటి ఛానల్, బోధన్: తోటి ఉపాధ్యాయురాలికి ఘోరం జరిగిందని నియోజకవర్గమంతా బంద్ పాటించి, 600 మంది టీచర్లు ఎండనక రోడ్డెక్కి గొంతు చించుకుంటుంటే.. బోధన్‌లోని ఆ రెండు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు మాత్రం ఒక్కరోజు బడి బంద్ చేస్తే కొంపలు మునిగిపోతాయన్నంత భయం పట్టుకుంది! “రక్షణ చట్టాలు గిట్టాలు మాకొద్దు.. మానవత్వంతో మాకు పనేలేదు.. గల్లా పెట్టె నిండాల్సిందే” అన్నట్టు యథావిధిగా బెల్లు కొట్టి క్లాసులు నడిపించేశారు. తోటి గురువుకే అన్యాయం జరిగితే చీమ కుట్టినట్లయినా లేని ఈ ‘వ్యాపార గురువులు’.. ఇక క్లాసురూముల్లో కూర్చోబెట్టి విద్యార్థులకు ఏ సంస్కారాన్ని, నైతిక విలువలను నూరిపోస్తున్నారో ఆ దేవుడికే తెలియాలి!

