చంటి ఛానల్,బోధన్: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ సరఫరాపై ఆంక్షలు విధించడంతో, నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని హోటల్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడింది. గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో హోటల్ నిర్వాహకులు ప్రత్యామ్నాయంగా పాత పద్ధతిని ఆశ్రయించారు. హోటళ్లను మూసివేయకుండా, కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసి వంటలు వండి ప్రజలకు అందిస్తున్నారు. గ్యాస్ కొరత తీరే వరకు ఈ కట్టెల పొయ్యిలే దిక్కని, పాత రోజులను గుర్తు చేస్తూ బోధన్ హోటళ్లలో వంటలు సాగుతున్నాయి. ఈ గ్యాస్ కష్టాలు ఇంకెన్నాళ్లు ఉంటాయోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు

