చంటి ఛానల్,బోధన్: అంతర్జాతీయ యుద్ధ పరిణామాలతో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత గరిష్ట స్థాయికి చేరి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆయిల్ కంపెనీలు కోటా పద్ధతిలో అరకొరగా సరఫరా చేస్తుండటంతో, పట్టణంలో ఒక బంకు తెరిచి ఉంటే పది బంకులు మూతపడే దారుణ పరిస్థితి నెలకొంది. ఇంధనం కోసం వాహనదారులు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తుండగా, రాబోయే ఐదారు రోజుల్లో ధరలు కొండెక్కి సామాన్యుడి నడ్డి విరవడం ఖాయమని మేధావులు హెచ్చరిస్తున్నారు. అస్తవ్యస్తమైన సరఫరా, ఆకాశాన్నంటనున్న ధరలతో బతుకు బండి భారమైపోతోందని జనం ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

