Explore

Search

November 7, 2026 6:22 pm

​బోధన్ నూతన ఆర్డీవో గా విజయ కుమారి బాధ్యతల స్వీకరణ

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ డివిజన్ నూతన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO)గా డిప్యూటీ కలెక్టర్ ఎం. విజయ కుమారి సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ సబ్ కలెక్టర్‌గా పనిచేసిన వికాస్ మహతో (IAS) ఏప్రిల్ 25న పదోన్నతిపై బదిలీ కావడంతో, అప్పటి నుండి నిజామాబాద్ ఆర్డీవో కే. రాజేంద్ర కుమార్ ఇంచార్జ్ బాధ్యతలు నిర్వహించారు. నేడు ఆయన నుండి విజయ కుమారి పూర్తిస్థాయిలో బాధ్యతలను స్వీకరించారు. గతంలో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డు (HMWSSB)లో కీలక విధులు నిర్వహించిన ఆమె, ఇప్పుడు బోధన్ ఆర్డీవో గా తన సేవలను అందించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్