చంటి ఛానల్,బోధన్: పదవ తరగతి ఫలితాల్లో బోధన్ పట్టణంలోని విజయ సాయి హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు. విద్యార్థులు ఎస్. భవాని (587), ఎ. సాయి దీక్షిత్ (587) తో పాటు మరికొందరు భారీ మార్కులతో బోధన్ డివిజన్‌లోనే టాప్ స్థానాల్లో నిలిచారు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్‌లో 15 మంది, తెలుగులో ముగ్గురు, సోషల్‌లో ఒకరు 100/100 మార్కులు సాధించడం విశేషం. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ పాఠశాల యాజమాన్యం ఎస్. కృష్ణమోహన్, చక్రవర్తి హర్షం వ్యక్తం చేశారు.

