చంటి ఛానల్,బోధన్: వాతావరణ సమతుల్యత, సుభిక్షంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ, బోధన్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో ‘యోగ్ ధారణ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఈరోజు ‘వరుణ మహా యాగం’ ప్రారంభమైంది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఉదయ్ మహరాజ్ నేతృత్వంలో వేద పండితుల సమక్షంలో జరుగుతున్న ఈ పవిత్ర కార్యక్రమంలో గణపతి పూజ, వరుణ దేవత ఆవాహన, మహా వరుణ హోమం, గోపూజ వంటి పూజలతో పాటు విచ్చేసిన భక్తులకు మహా అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. రైతులు, యువత, ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యజ్ఞాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.

