Explore

Search

November 7, 2026 6:23 pm

​శ్రీ వేద భారతి పీఠాధిపతిని శాలువాతో గౌరవించిన ఉదయ్ మహారాజ్

చంటి ఛానల్,బాసర: నేడు వ్యాస పౌర్ణమి (గురు పౌర్ణమి) పర్వదినాన్ని పురస్కరించుకుని బాసరలోని ‘శ్రీ వేద భారతి పీఠం’ పీఠాధిపతి శ్రీ వేద విద్యా నందగిరి స్వాములవారిని బీజేపీ ధార్మిక సెల్ రాష్ట్ర సలహాదారులు ఉదయ్ మహారాజ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. గత కొన్నేళ్లుగా కులభేదాలకు అతీతంగా పిల్లలందరికీ వేదవిద్యను అందించడం, విద్యార్థులకు జ్ఞాన వికాసం కలగాలని ఉచితంగా వారి నాలుకపై బీజాక్షరాలు రాయడం, ప్రయాగ్‌రాజ్‌లో ఏటా గంగా హారతి నిర్వహించడం వంటి స్వామివారి విశేష ధార్మిక సేవలకు గుర్తింపుగా ఈ సత్కారం జరిగింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా దైవానుగ్రహంతో వాటన్నింటినీ అధిగమిస్తూ, సమాజంలోని అందరినీ ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న స్వామివారి కృషిని ఈ సందర్భంగా కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్