Explore

Search

November 7, 2026 6:22 pm

ఎరాజ్ పల్లిలో విషాదం: ఉపాధి హామీ పనిలో కూలి మృతి

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలం ఎరాజ్ పల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్ద ఓ కూలి అకస్మాత్తుగా కుప్పకూలి మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. పనిలో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురైన సదరు కూలీని తోటి వారు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. ఎండ తీవ్రత కారణంగానే ఈ మరణం సంభవించి ఉంటుందని భావిస్తుండగా, అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్