చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తీరుపై రైతులు భగ్గుమన్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న యూరియా కోసం వస్తే, సొసైటీ నిర్వాహకులు బలవంతపు నిబంధనలు రుద్దుతున్నారని ఆందోళనకు దిగారు.రెండు బస్తాల యూరియా కావాలంటే కచ్చితంగా సాగరిక 10 కేజీల గుళికలు (రూ. 420), నానో యూరియా (రూ. 225), లేదా నానో డీఏపీ (రూ. 600) కొనుగోలు చేయాలని, ఎక్కువ బస్తాలు తీసుకుంటే రెండు ఉత్పత్తులు కొనాలని సిబ్బంది తెగేసి చెబుతున్నారు. సొసైటీ సేల్స్ టార్గెట్ల కోసం తమపై ఈ అదనపు భారం మోపడం అన్యాయమని రైతులు మండిపడుతున్నారు. వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి, ఎలాంటి షరతులు లేకుండా తమకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

