చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్‌లోని ఇందూర్ హైస్కూల్ విద్యార్థులు SSC ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి మార్కులను సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు,బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొని, విద్యార్థులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులు నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించిన ఆయన, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. ముఖ్యంగా 583 మార్కులు సాధించిన సిబ్బల్వార్ రాజేష్‌తో పాటు, వి. హర్షవర్ధన్ (573), బి. గణేష్ కుమార్ (571), బి. శ్రీను (569), దీపిక (568), సాక్షి (567), ఎం. వైష్ణవి (566), కె. సహస్ర, డి. నిఖిత్ (564) వంటి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని పేర్కొన్నారు. తమ విద్యార్థుల ప్రతిభను గుర్తించి సన్మానించినందుకు పాఠశాల కరస్పాండెంట్ కొడాలి కిషోర్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

