చంటి ఛానల్,నిజామాబాద్: స్థానిక నాగారం స్టేడియంలో జూలై 7న అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12 సంవత్సరాల లోపు బాలబాలికలకు నిర్వహించిన జిల్లాస్థాయి 300 మీటర్ల పరుగు పందెంలో శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ పోటీల్లో ఏడవ తరగతి చదువుతున్న టి. అనన్య ద్వితీయ స్థానం, ఆరవ తరగతి విద్యార్థిని టి. మోక్ష తృతీయ స్థానం కైవసం చేసుకుని పాఠశాలకు మంచి పేరు తెచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థుల కృషి, పట్టుదలను మెచ్చుకుంటూ.. భవిష్యత్తులో వారు మరెన్నో ఉన్నత విజయాలు సాధించాలని పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. కృష్ణమోహన్, చక్రవర్తి, రాజు చిన్నారులను ఆశీర్వదించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

