Explore

Search

November 7, 2026 6:07 pm

తెలంగాణ తల్లి విగ్రహానికి తప్పని అవమానం.. తక్షణమే స్పందించాలంటున్న ప్రజలు

చంటి ఛానల్,బోధన్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు, అధికారులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి లాంఛనంగా వేడుకలు జరుపుకుంటున్నప్పటికీ, ఆ విగ్రహం దయనీయ స్థితిని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. విగ్రహాన్ని నిశితంగా గమనిస్తే ముఖం, చేతులు, చీరపై రంగులు పూర్తిగా వెలిసిపోయి, పెచ్చులు ఊడిపోయి అత్యంత కళావిహీనంగా దర్శనమిస్తోంది. ఉత్సవాల పేరిట కేవలం నీళ్లు చల్లి, దండలు వేసి మమ అనిపించారే తప్ప, కనీసం ఏడాడికి ఒక్కసారైనా విగ్రహానికి రంగులు వేయించి, మరమ్మతులు చేయాలన్న ఆలోచన ఏ ఒక్క నాయకుడికి గానీ, పురపాలక అధికారులకు గానీ రాకపోవడం గమనార్హం. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహం పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి విగ్రహానికి రంగులు వేయించి తగిన గౌరవం కల్పించాలని ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్