Explore

Search

November 7, 2026 6:11 pm

​”బోధన్ మైకు వీరుడు: పిలవని పేరంటం.. అర్చకుడి వీరంగం!”

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో ఒక అర్చకుడి అతి ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా మారింది. పట్టణంలో ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా, ఆహ్వానం ఉన్నా లేకపోయినా.. ఈయనగారు అక్కడ ప్రత్యక్షమవ్వాల్సిందే! జన సందోహం కనిపిస్తే చాలు, నిర్వాహకులను తోసేసి మరీ మైకు లాక్కొని మైమర్చిపోయి ఉపన్యాసాలు దంచేయడం ఆయనకో అలవాటుగా మారింది. తాజాగా ఓ కార్యక్రమంలో తనను ప్రశ్నించిన వారిపైనే “నువ్వెవడ్రా?” అంటూ రెచ్చిపోయి దుర్భాషలాడటం ఆయన విజ్ఞతకే వదిలేయాలి. భక్తి నేర్పాల్సిన చోట ఈ ‘శక్తి’ ప్రదర్శన ఏంటని జనం నవ్వుకుంటున్నారు. ఈ “అన్‌స్టాపబుల్” అర్చకుడు తన నోటికి, స్పీడుకు కళ్లెం వేసుకోకపోతే.. ముందుముందు ప్రజలే గట్టిగా ‘ప్రసాదం’ పెట్టేలా ఉన్నారని స్థానికులు సెటైర్లు వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్