Explore

Search

November 8, 2026 3:50 pm

మత మనోభావాలపై టీచర్ దాడి.. ఎడపల్లిలో భక్తి పోరాటం!

చంటి ఛానల్,ఎడపల్లి: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని మంగళ్‌పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలి తీరు వివాదాస్పదంగా మారింది. పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి హనుమాన్ మాల ధరించి పాఠశాలకు రాగా, సదరు ఉపాధ్యాయురాలు ఆ విద్యార్థిని ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ హనుమాన్ స్వాములు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఉపాధ్యాయురాలి ప్రవర్తన తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, స్వాములు పాఠశాల గేటు ఎదుట భజన చేస్తూ ఆందోళన నిర్వహించారు. విద్యార్థుల విశ్వాసాలను గౌరవించని సదరు ఉపాధ్యాయురాలిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్