చంటి ఛానల్,బోధన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ బోధన్‌లో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు సతీష్ వడ్ల ఆధ్వర్యంలో సుమారు 1200 మంది విద్యార్థులతో ఆర్డీవో కార్యాలయానికి భారీ ర్యాలీ నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా మాట్లాడుతూ.. దుబారా ఖర్చులకు వందల కోట్లు తగలేస్తున్న ప్రభుత్వానికి, పేద విద్యార్థుల ఫీజులు చెల్లించడానికి పైసల్లేవా అని నిలదీశారు,కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, స్థానిక కౌన్సిలర్లు, బీఆర్ఎస్వీ నాయకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

