Explore

Search

November 7, 2026 5:56 pm

క్రిసెంట్ హైస్కూల్ టీచర్లకు రాష్ట్ర స్థాయి అవార్డులు

చంటి ఛానల్,హైదరాబాద్: బోధన్‌లోని క్రిసెంట్ హైస్కూల్ ఉపాధ్యాయులు మహమ్మద్ సాదత్ అలీ, రఫీకుల్లా షేక్‌లకు ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి “ఉత్తమ ఉపాధ్యాయ” (Best Teacher Award) పురస్కారాలు లభించాయి. మంగళవారం హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని బిర్లా సైన్స్ మ్యూజియం (భాస్కర ఆడిటోరియం)లో ‘అసోసియేషన్ ఆఫ్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్’ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్, రిటైర్డ్ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్, విద్యావేత్త అలెఫియా హుస్సేన్, సంఘ అధ్యక్షుడు అన్వర్ అహ్మద్ చేతుల మీదుగా వీరిద్దరూ వినూత్న బోధనా పద్ధతులకు గుర్తింపుగా ఈ అవార్డులను అందుకున్నారు. పాఠశాలకు పేరు తెచ్చిన ఈ ఉపాధ్యాయులను యాజమాన్యం, తోటి ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్