చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర గౌడ సంఘం ఆధ్వర్యంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, ఆయన పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు లక్ష్మ గౌడ్, డైరెక్టర్ మీసాల లక్ష్మణ్ గౌడ్, సభ్యులు స్వామి గౌడ్, మొగలా గౌడ్, సుధీర్ గౌడ్, శేఖర్ గౌడ్, రాజా గౌడ్, లక్ష్మణ్ గౌడ్, గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

