Explore

Search

November 7, 2026 6:11 pm

నిరుద్యోగులకు ఊరట: బోధన్ ఆర్టీసీ డిపోలో తాత్కాలిక కండక్టర్ల భర్తీ!

చంటి ఛానల్,బోధన్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బోధన్ బస్ డిపో పరిధిలో రోజువారీ ప్రాతిపదికన పనిచేసేందుకు తాత్కాలిక కండక్టర్ల నియామక ప్రకటన విడుదలైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు కాగా, ఎంపికైన వారికి రోజుకు రూ. 800/- వేతనం చెల్లించబడుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ పదో తరగతి ఒరిజినల్ మెమో, గుర్తింపు కార్డు (Aadhaar Card), రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో నేరుగా బోధన్ బస్ డిపోలో ఉదయం 6:00 గంటలకు సంప్రదించాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం ఉన్న రద్దీ, అవసరాల దృష్ట్యా ఈ తాత్కాలిక నియామకాలు చేపడుతున్నట్లు డిపో అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్