Explore

Search

November 7, 2026 6:45 pm

రిలయన్స్ స్మార్ట్ అరాచకం: నడిరోడ్డుపై పార్కింగ్.. మృత్యుపాశంగా బోధన్ రోడ్డు!

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ కొత్త బస్టాండ్ వద్ద రిలయన్స్ స్మార్ట్ ఆగడాలు హద్దు దాటుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి, సెల్లార్ పార్కింగ్‌ను వదిలేసి, కస్టమర్ల వాహనాలను నడిరోడ్డుపై నిలుపుతూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. లాభాల వేటలో సగం రోడ్డును కబ్జా చేసినా మున్సిపల్, పోలీస్ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు మొత్తుకుంటున్నా పట్టించుకోని ఈ నిర్లక్ష్యం రేపు ఏ నిండు ప్రాణాన్ని బలితీసుకుంటుందో అని ప్రజలు నిలదీస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకోకపోతే జనం ఆగ్రహానికి అధికారులు, యాజమాన్యం బలికాక తప్పదు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్