చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని క్రిసెంట్ హై స్కూల్‌లో పదో తరగతి విద్యార్థులకు హాల్ టిక్కెట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్ జావేద్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, విద్యార్థుల తల్లిదండ్రుల చేతుల మీదుగా హాల్ టిక్కెట్లను అందజేయడం విశేషం. రాబోయే వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధించాలని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

