చంటి ఛానల్,నిజామాబాద్: సాలూర మండల కేంద్రంలో పిచ్చికుక్కలు ప్రాణాలు తోడేస్తున్నాయి. నేడు ఏకంగా 09 మందిని కరిచి తీవ్రంగా గాయపరిచాయి. గతంలో ఈ కుక్కల కాటుకు గురైన ఆవులు కూడా చనిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసిపిల్లలకు ఇవి ఎదురైతే ప్రాణాలు దక్కవని భయంతో వణికిపోతున్నారు. కుక్కలను అరికట్టడంలో గ్రామపంచాయతీ అధికారులు పూర్తిగా చేతులెత్తేశారు. తక్షణమే అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించకపోతే, భారీ ధర్నాకు దిగుతామని గ్రామస్తులు తీవ్రస్థాయిలో హెచ్చరిస్తున్నారు.

