Explore

Search

November 7, 2026 7:44 pm

ప్రజా పాలన సభ: అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి – కలెక్టర్ ఇలా త్రిపాఠి

చంటి ఛానల్,నిజామాబాద్: అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరినప్పుడే సత్వర ప్రగతి సాధ్యమని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బోధన్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సభలో ఆమె మాట్లాడుతూ.. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి వంటి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సెల్ఫ్ ఫోటో క్యాప్చరింగ్ ద్వారా పనుల పురోగతిని అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలకు రూ. 3.80 కోట్ల కమిషన్ చెక్కును, అంగన్వాడీలకు సెల్ ఫోన్లను పంపిణీ చేయడంతో పాటు, బడి బయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్