చంటి ఛానల్,బోధన్: ఆదివారం నిర్వహించిన ఎస్జీఎఫ్ (SGF) జిల్లా స్థాయి యోగా పోటీల్లో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన ‘ఓం యోగశాల’ సాధకులు అద్భుత ప్రతిభ కనబరిచి 5 గోల్డ్, 2 సిల్వర్ మెడల్స్‌తో మొత్తం 7 పతకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. విద్యార్థుల కఠిన సాధన, క్రమశిక్షణ వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని, ఈ ఘనత సాధించడం పట్టణానికే ఎంతో గర్వకారణమని యోగా మాస్టర్ గంగాధర్ మరియు సాధకులు హర్షం వ్యక్తం చేయగా, వారిని పలువురు అభినందించారు.

