చంటి ఛానల్,బోధన్: పెంటాకలాన్ స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) మహాజన సభ సమావేశం శనివారం అఫీషియల్ పర్సనల్ ఇంచార్జ్ ఏ. రవీందర్ అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి షేక్ బాబా గత ఏడాది లావాదేవీల వివరాలను చదివి వినిపించారు. ఈ సభలో సంఘంపై నూతన భవన నిర్మాణం, బోర్వెల్ వేయడం మరియు యూరియా యాప్లో మార్పులు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాల్ రెడ్డి, సంజీవ్ కుమార్, రాజారెడ్డి, వెంకట్ రెడ్డి, కృష్ణారెడ్డి, పీరయ్య, గ్రామ పెద్దలు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

