చంటి ఛానల్,బోధన్: పెంటాకలాన్ స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని PCC డెలిగేట్ బెల్లిడి గంగా శంకర్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, BRS మండల అధ్యక్షుడు సంజీవ్ కుమార్, పెంటాకలాన్ మాజీ సర్పంచ్ రమణ, బర్దిపూర్ మాజీ సర్పంచ్ సాయి రెడ్డి, పెగడపల్లి ఉపసర్పంచ్ షబ్బీర్, బర్దిపూర్ ఉపసర్పంచ్ కుర హనుమండ్లు, సంఘం మాజీ అధ్యక్షులు దొనకంటి రాజా రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ఏవో సంతోష్, ఏఈవో సుప్రియ, సంఘ కార్యదర్శి షేక్ బాబా, గ్రామ పెద్దలు నాగరాజు, దమ్మయ్య, మద్ది సుదర్శన్, పోతా రెడ్డి, కె.పి. శ్రీనివాస్ రెడ్డి, ముత్తి రాములు, శివకుమార్, పద్మాకర్ తదితరులు, రైతులు, సంఘ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని వరి ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రారంభించారు.

