Explore

Search

November 7, 2026 6:11 pm

PACS మహాజన సభ: రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా కీలక తీర్మానాలు

చంటి ఛానల్,బోధన్: పట్టణంలోని  మహాలక్ష్మి కళ్యాణ మండపంలో ఈరోజు (మార్చి 30, 2026) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) మహాజన సభ సమావేశం అట్టహాసంగా జరిగింది. అఫీషియల్ పర్సనల్ ఇంచార్జ్ ఎ. రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సంఘ కార్యదర్శి ఉమాకాంత్ గత ఏడాదికి సంబంధించిన జమ ఖర్చులు, లావాదేవీల నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా రైతుల ప్రయోజనాల దృష్ట్యా పలు కీలక తీర్మానాలు చేశారు. ముఖ్యంగా యూరియా యాప్‌లో మార్పులు లేదా తొలగింపు, ఎకరానికి 40 క్వింటాళ్ల చొప్పున మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేలిముద్రలకు బదులు OTP విధానం అమలు చేయాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. అలాగే వడ్ల కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని, చిన్న సన్నకారు రైతులు తమ ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా రైస్ మిల్లులకు తరలించేందుకు అనుమతించాలని కోరారు. ఈ కార్యక్రమంలో VDC అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారీ, మాజీ అధ్యక్షులు ఉద్మీర్ లక్ష్మణ్, వైస్ ఛైర్మన్ వీరభద్ర రావు, మాజీ CDC ఛైర్మన్ పోతారెడ్డితో పాటు గ్రామ పెద్దలు, సంఘ సభ్యులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్