Explore

Search

November 7, 2026 6:07 pm

తగ్గేదే లేదన్న అధికారులు: గోశాల రోడ్డు క్లీన్.. నెక్స్ట్ టార్గెట్ బడా బాబులేనా?

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ గోశాల రహదారిపై విద్యార్థులకు, పాదచారులకు నరకం చూపుతున్న ఆక్రమణలపై అధికారులు కొరడా ఝుళిపించారు. మున్సిపల్ కమిషనర్, ఎస్హెచ్వో వెంకటనారాయణల నేతృత్వంలో అక్రమ దుకాణాలను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ముందస్తు నోటీసులు ఇవ్వలేదంటూ వ్యాపారులు, రాజకీయ నాయకులు అడ్డుతగిలినా అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. రాజకీయ ఒత్తిళ్లను బేఖాతరు చేస్తూ రోడ్డును క్లియర్ చేసిన అధికారుల తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇదే స్ఫూర్తితో డ్రైనేజీ కబ్జాదారులు, రోడ్లపై అక్రమ పార్కింగ్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న ‘బడా బాబుల’ భరతం కూడా పట్టాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్