Explore

Search

November 7, 2026 6:22 pm

యాప్ వద్దు.. పాత పద్ధతే ముద్దు: బాసర రోడ్డుపై రైతుల ‘బైఠాయింపు’ – కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!

చంటి ఛానల్ ,నిజామాబాద్:  నవిపేట మండల కేంద్రంలో రైతులు కదం తొక్కారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యూరియా యాప్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్-బాసర రహదారిపై గంటకు పైగా రాస్తారోకో నిర్వహించారు. స్మార్ట్ ఫోన్లు వాడని సామాన్య రైతులకు ఆన్‌లైన్ బుకింగ్ శాపంగా మారిందని, యాప్ పేరుతో ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురిచేస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే ఎటువంటి నిబంధనలు లేకుండా యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని, లేనిపక్షంలో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సమస్య పరిష్కారం అయ్యే వరకు వెనక్కి తగ్గేదే లేదని రైతులు భీష్మించుక కూర్చున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్