చంటి ఛానల్,నిజామాబాద్: బస్టాండ్ సమీపంలోని హరిచరణ్ పాఠశాలలో అక్టోబర్ 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల బరిలో ‘సేవా భారతి ప్యానల్’ తరఫున 15 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా, బ్యాలెట్ పేపర్‌లోని సీరియల్ నంబర్లే వారి గుర్తింపు సంఖ్యలుగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ప్యానల్ తరఫున బగుల రంజిత్ సింగ్ (4), చౌహాన్ బాలాజీ (6), దీకొండ యాదగిరి (8), ఈ. శీనా నాయక్ (10), జెస్సు అనిల్‌కుమార్ (12), కెంపుల నాగరాజు (14), కొండ సత్యప్రసాద్ (15), మల్లెపుల జగన్ మోహన్ గౌడ్ (18), మింకీ వేణుగోపాల్ (19), ముజ్జా లక్ష్మణ్‌రావు (20), పద్మ సుభాష్ (23), పోతంకర్ లక్ష్మీనారాయణ (24), పురుషోత్తం రెడ్డి.పీ (25), రాజులదేవి రవినాథ్ (26), యెండల సుధాకర్ (29)లు పోటీలో నిలిచారని, ఓటర్లు తమ వివరాలు పరిశీలించుకుని నిబంధనల ప్రకారం ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

