చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలో సాక్షాత్తూ ప్రభుత్వ కార్యాలయాల పక్కనే పేకాట వ్యవహారం సాగుతుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఒకవైపు ఎమ్మార్వో ఆఫీసు, మరోవైపు మున్సిపల్ కార్యాలయం.. సరిగ్గా ఈ పాలనా కేంద్రాల మధ్యనున్న పాతబడ్డ భవనాల్లో కొందరు ఏమాత్రం భయం లేకుండా నిర్భయంగా పేకాట ఆడుతున్నారు. అధికారుల ముక్కు కిందే, అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నా సంబంధిత యంత్రాంగం అటు వైపు కన్నెత్తి చూడకపోవడం స్థానికంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. వెంటనే సంబంధిత అధికారులు తక్షణమే పేకాట రాయుళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

