చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని ఇందూర్ మోడల్ స్కూల్లో విద్యార్థులకు అంతరిక్షం, గ్రహాలపై దృశ్యరూపంలో (విజువలైజేషన్) అవగాహన కల్పించేందుకు ‘మొబైల్ ప్లానిటోరియం’ ప్రదర్శన నిర్వహించారు. పుస్తకాల్లోని పాఠాలు సులభంగా అర్థమై, పరీక్షల్లో గుర్తుండేందుకే ఈ వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు స్కూల్ డైరెక్టర్ కొడాలి కిషోర్ తెలిపారు. ముఖ్యఅతిథి నాగయ్య ఈ ప్రదర్శనను తిలకించి యాజమాన్యాన్ని అభినందించగా, దాదాపు 1000 మంది విద్యార్థులు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు.

