Explore

Search

November 7, 2026 6:32 pm

MIM కోసం కాంగ్రెస్ దగా.. బోధన్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ!

చంటి ఛానల్,బోధన్: మున్సిపాలిటీలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎంఐఎం (MIM) పార్టీ అభ్యర్థి నామినేషన్ స్క్రూటినీలో తిరస్కరణకు గురైనప్పటికీ, ఆ పార్టీ ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని ఆయన మండిపడ్డారు. మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం చేతిలో పావులా మారిందని, స్థానిక ఎమ్మెల్యే మౌనం వహించడం సిగ్గుచేటని విమర్శించారు. ఇలాంటి “చిల్లర రాజకీయాలకు” చరమగీతం పాడాలంటే బోధన్ మున్సిపాలిటీలో బీజేపీ విజయం సాధించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్