Explore

Search

November 7, 2026 6:22 pm

బయట పాలు.. లోపల గుట్కాలు: బోధన్ కొత్త బస్టాండ్‌లో ‘విజయ’వంతమైన దందా!

చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ కొత్త బస్టాండ్‌లోని ‘విజయ డెయిరీ’ స్టాల్‌లో పాలకు బదులు గుట్కాలు, సిగరెట్లు యథేచ్ఛగా అమ్ముతూ యువతను వ్యసనాలకు బానిసలు చేస్తున్నారు. ఈ వ్యవహారం కళ్లెదుటే జరుగుతున్నా RTC అధికారులంతా ఏమీ పట్టనట్లు కళ్లు మూసుకుని కూర్చోవడం విడ్డూరంగా ఉంది; బహుశా ఆ సిగరెట్ల పొగ దట్టంగా కమ్మేసి అధికారుల కళ్లకు లోపల జరిగే ఈ దందా కనిపించడం లేదేమో! ఇప్పటికైనా సంబంధిత డిపో మేనేజర్, అధికారులు నిద్ర వీడి వెంటనే ఆ స్టాల్ లైసెన్స్ రద్దు చేయాలని, లేదంటే ఆ బోర్డు తీసేసి ‘విజయ గుట్కా స్టాల్’ అని మార్చుకుంటే సరిపోతుందని జనం తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్