చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర గోశాలలో ఆదివారం సాయంత్రం సుమారు 6:20 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆవరణలో నిల్వ ఉంచిన గడ్డి కుప్పలు పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే చర్యలు చేపట్టారు. సమయానికి నిర్వాహకులు అప్రమత్తమై గోవులను బయటకు పంపించడంతో మూగజీవాలకు ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదానికి గల కారణాలు మరియు నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

