Explore

Search

November 7, 2026 6:32 pm

మద్యం తాగి బైక్ నడిపిన వ్యక్తికి 7 రోజుల జైలు శిక్ష

చంటి ఛానల్,బోధన్: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలాంపాడ్ గ్రామానికి చెందిన సాయరెడ్డి, మద్యం మత్తులో ద్విచక్ర వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసును విచారించిన బోధన్ స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి, నిందితుడికి ఏడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా బోధన్ ఎస్‌హెచ్‌వో (SHO) వెంకటనారాయణ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం పొంచి ఉంటుందని, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్