చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలం మావంది కుర్డ్ సెంటర్ నందు పాక్స్ (PACS) ఆధ్వర్యంలో మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని క్లస్టర్ అధికారి అనుపుల రవీందర్, పి.ఐ.సి సొసైటీ చైర్మన్ గంగశంకర్ కలిసి ప్రారంభించారు. రైతులు మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ లక్ష్మణ్, సర్పంచ్ సాయిలు, సి.ఈ.వో ఉమాకాంత్, ఇతర నాయకులు, రైతులు పాల్గొన్నారు.

