చంటి ఛానల్,బోధన్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో 290 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి, రూ. 10,000 కోట్ల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్నారని బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ పద్మ శరత్ రెడ్డి తెలిపారు. బోధన్ ఆర్టీసీ బస్టాండ్లో డిపో మేనేజర్ విశ్వనాధ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ పథకం వల్ల పల్లెల నుండి పట్టణాలకు వచ్చే మహిళలకు ఆర్థికంగా ఎంతో ఆసరా లభిస్తోందని, కుటుంబ సంపాదనకు ఇది తోడ్పడుతుందని వివరించారు. ఈ సందర్భంగా మహిళా ప్రయాణికులను సత్కరించి, ఆర్టీసీ కల్పిస్తున్న భద్రతా చర్యలను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

