Explore

Search

November 7, 2026 6:23 pm

హోలీ వేళ మద్యం షాపులు బంద్: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశం

చంటి ఛానల్,నిజామాబాద్: హోలీ పండుగ, కామదహనం నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని సీపీ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్., ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968 సెక్షన్ 20(1) ప్రకారం.. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్‌లు మరియు క్లబ్బులను మార్చి 3వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మార్చి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని ఆయన ఆదేశించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీస్ శాఖ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్