Explore

Search

November 7, 2026 6:11 pm

జాబ్ మేళా అదుర్స్: 11 కంపెనీలు, 277 ఉద్యోగాలు!

చంటి ఛానల్ ,బోధన్: స్థానిక ఉషోదయ డిగ్రీ కళాశాలలో ‘టాస్క్’ (TASK) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. ఈ ఉపాధి వేదికకు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా సుమారు 423 మంది అభ్యర్థులు హాజరుకాగా, మెడ్ ప్లస్, హెటిరో ఫార్మా, టాటా ఏఐజీ వంటి 11 ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి మొత్తం 277 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశాయి. ఎంపికైన వారికి ఏడాదికి గరిష్టంగా ₹4 లక్షల (4.0 LPA) వరకు వేతనాన్ని ఆఫర్ చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కళాశాల యాజమాన్యం, ‘టాస్క్’ ప్రతినిధులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్