Explore

Search

November 7, 2026 6:22 pm

బోధన్‌లోని ప్రజ్ఞ జూనియర్ కళాశాలకు ఇంటర్ బోర్డు గుర్తింపు

చంటి ఛానల్,నిజామాబాద్: బోధన్ మండలం ఆచన్‌పల్లిలోని ప్రజ్ఞ జూనియర్ కళాశాలకు (కళాశాల కోడ్: 45239) 2026-2027 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) తాత్కాలిక గుర్తింపు (Provisional Affiliation) మంజూరు చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం కళాశాలలో ఎంపీసీ (MPC), బైపీసీ (BPC) గ్రూపుల్లో తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో 2 సెక్షన్లకు కలిపి మొత్తం 176 మంది విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి లభించింది. కళాశాల యాజమాన్యం సిబ్బందికి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని, అకడమిక్ క్యాలెండర్‌ను తూచా తప్పకుండా పాటించాలని బోర్డు స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్