చంటి ఛానల్,బోధన్: పట్టణ ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. బుధవారం ఆచన్‌పల్లి 1వ వార్డులో పెరుగుతున్న దోమల బెడదను అరికట్టేందుకు మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి, కమిషనర్ జాదవ్ కృష్ణ, కౌన్సిలర్ లక్ష్మీ శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో మాలాతీయన్ ద్రావణాన్ని ముమ్మరంగా పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పట్టణవ్యాప్తంగా పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రజలు కూడా తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొని పనులను పర్యవేక్షించారు.

