Explore

Search

November 7, 2026 6:07 pm

ఎరాజ్ పల్లిలో శ్రీ మహాలక్ష్మి ఆలయ శిఖర ప్రతిష్టాపన

చంటి ఛానల్,బోధన్: ఎరాజ్ పల్లి గ్రామంలో శ్రీ మహాలక్ష్మి మందిర ఆలయ శిఖర ప్రతిష్టాపన,నూతన గదుల ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. గ్రామ మాజీ సర్పంచ్ సంజీవ రెడ్డి, సోదరులు నర్సా రెడ్డి, సాయిరెడ్డిల ఆహ్వానం మేరకు బోధన్ పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు వాసర గంగాధర్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు బీర్కూర్ శంకర్, వాస్తు ఇంజనీర్ కర్నె శ్రీనివాస్, న్యాయవాది దత్తత్రి కులకర్ణి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వసంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సహకరించిన వారిని గ్రామస్తులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్