చంటి ఛానల్, నిజామాబాద్: బోధన్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ పద్మ శరత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత స్వాతంత్ర్య సమరయోధులను ఆదర్శంగా తీసుకొని గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాజ్, కమిషనర్ జాదవ్ కృష్ణ, కౌన్సిలర్లు రేణుక బాలరాజు, ముషీర్ బాబా తదితరులు పాల్గొన్నారు.

