చంటి ఛానల్, బోధన్: తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో విఠల్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్డీవో విజయకుమారి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్ర్యమని, పిల్లల్లో చిన్నతనం నుంచే దేశభక్తి భావాన్ని పెంపొందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పద్మ శరత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్ , కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

