చంటి ఛానల్,బోధన్: రెంజల్ మండలం నీలా శివారులోని పంట పొలాల్లో అక్రమంగా ఇసుక నిల్వలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించి, వాటిని సీజ్ చేసి ప్రభుత్వ పరం చేశారు. స్వాధీనం చేసుకున్న ఈ ఇసుకను అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ తదితర ప్రభుత్వ భవన నిర్మాణ అవసరాల కోసం కేటాయించారు. బోధన్ మండల పోలీసుల సహకారంతో బందోబస్తు నడుమ ఈ ఇసుకను తరలిస్తుండగా అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా అధికారులు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తూ.. ఇకపై ఎవరైనా తమ పట్టా భూముల్లో ఇలా ఇసుకను అక్రమంగా నిల్వ చేస్తే, వారి పట్టా పాస్ పుస్తకాలను తక్షణమే రద్దు చేసి, అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

