Explore

Search

November 7, 2026 6:22 pm

బోధన్‌లో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర

చంటి ఛానల్,బోధన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో 100 మీటర్ల భారీ జాతీయ జెండాతో ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వడ్డీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై మువ్వన్నెల జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పసులోటి గోపికిషన్, బీజేవైఎం అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రకటన
ప్రత్యక్ష క్రికెట్ స్కోర్