చంటి ఛానల్, నిజామాబాద్: సాలుర మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ మోడల్ హౌస్ (నమూనా ఇల్లు) నిర్మాణానికి నేడు ఘనంగా భూమి పూజ నిర్వహించారు. పీసీసీ డెలిగేట్ గంగ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ నిర్మాణ పనులను ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో సాలురా ఎమ్మార్వో, ఎంపీడీవో, హౌసింగ్ ఏఈలతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగ శంకర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకే ఈ నమూనా ఇంటిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఇళ్ల నిర్మాణ పథకాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

