చంటి ఛానల్,బోధన్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ 2026 ఫలితాల్లో బోధన్ పట్టణంలోని విజేత, సాయి విజేత జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు. కళాశాల విడుదల చేసిన వివరాల ప్రకారం.. ద్వితీయ సంవత్సరం (II Year) విభాగంలో బైపీసీ (BIPC) విద్యార్థిని హన్మంత్వార్ లావణ్య 992 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, ఎంపీసీ (MPC) విభాగంలో పిన్నల అమూల్య 991 మార్కులతో సత్తా చాటింది. అలాగే, ప్రథమ సంవత్సరం (I Year) ఫలితాల్లో సీఈసీ/ఎంఈసీ విభాగంలో ఉదత్వార్ శ్రీకర్ణి 484 మార్కులతో, ఎంపీసీ విభాగంలో అమృత్వార్ రుత్విక్, బాదురి వర్షిత్ రెడ్డి 467 మార్కులతో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విజయాన్ని అభినందిస్తూ, వారి తల్లిదండ్రులకు మరియు అధ్యాపక బృందానికి కళాశాల డైరెక్టర్ ఏరువ రమణా రెడ్డి అభినందనలు తెలియజేశారు.

